31 అక్టోబర్, 2014

గాలి బుడగలు

"ఈమె గుర్తుందా ???
వన్నెల పడవమీద గోదారి దాటిన మల్లెతీగే !!!
వాసంతాలు వెళ్ళిపోయాక మల్లెలు వాడి .... 
తీగ మిగిలింది . 
ఒంగి చూడు వాసనా కైనా గుర్తుపడతావేమో ????"



" తీగలని కదల్చకూడదు .... శ్రుతి చేయాలి . 
ఏవి ఎలా వాడాలో తెలీకుండా ఉపయోగించడం నేరం !! ,,



"నిన్నటి పెదాల తీయదనం నేడు ఎక్కడవుంది??? నిజానికి అప్పటి తీయదనం కూడా పెదాలది కాదు ,
హృదయాలది .  
మరి నేడు ???? ,,



"బరువెక్కిన కవితా హృదయం బద్దలయితే ,
కన్నీటి కుండల్లాంటి కవితలయ్యాయి . ,,



"తెలుగందం !
తెలుపందం !!
నిలబెట్టే తెలుగుపిల్ల మరింత మకరందం !!!,,

30 అక్టోబర్, 2014

neevu..

నీ జ్ఞ్యాపకాల అడుగుల తడి ,
           నా వెనకాలే అంటే .... భయంగా ఎం లేదు .
వెచ్చటి జీవితంలో .... చల్లని మలయమారుతంలా అనిపిస్తూ ఉంది .



నువ్వు నిజమో? కాదో ?
ఇప్పటికే తేలిపోయింది .
ఇప్పుడు కొత్తగా తేలింది నేను
అబద్దం కాదు అని !!!!

 


అడుగికి అడుగు కాక పోవచ్చు ,
కానీ ,,,,
అలసటలో మాత్రం ఊరటవే !!!!

22 ఆగస్టు, 2013

సమైక్యాంధ్ర

సంతానం ఎంతమందైనా ...... ఎలాంటి వ్యక్తిత్వంతో ఉన్నా .... 
రూపురేఖలలో తేడాలున్నా ....
భావాల్లో భేదాలున్నా ... ,
అందరి రక్తం ఒక్కటే ! ఒక్క తల్లి కన్నదే !
ఆ తల్లి బిడ్డలు గానే ప్రపంచం గుర్తిస్తుంది . 
ఒకడు కష్టపడ్డాను ,ఆటుపోటులు ఎదుర్కొన్నాను వేరే పోతానంటే ,
కలిసి వుండు నాయనా అందరూ తోడుంటారని చెప్తుంది . 
"తెలుగుదనం" అందరినీ ఒక్కటిగా వుండమంటుంది . 
అన్ని జిల్లాల గొప్పదనాలు కలిపి నిలబెట్టి ,
ఖ్యాతి సంపాదించిన నేలని ఎవరి ముక్క వారిదే అని ఎలా పంచుకోగలం ??
చిన్ననాటి కధలా ... పదికట్టెల మోపుకన్నా ..కట్టె ఒక్కటిగానే సులువుగా విరుగుతుంది . 
"సమైక్యవాదం" దగ్గరతనం తెస్తుంది . 
అందరం కలిసుందాం !
అవసరాలు కలిసి పంచుకుందాం !
కస్టాలు ఎదుర్కొని కలిసి నిలబడదాం !
ప్రపంచానికి తెలుగు ఒక్కటే ! 
తెలుగుదనం ఒక్కటే అని చాటిచెబుదాం !!!!!!


21 మార్చి, 2013

తెలుగుని కాపాడుకుందాం








 ____మన భాష !
 ____మన భావం !
____మన బాధ !
____మన భాధ్యత !!!
ఎందరో  మహానుభావుల చరిత్ర మనది !
ఎందరో అనుభవాలను, భావాలను పంచుకున్న భాష మనది !
ఎన్నో ప్రయోగాలను, కీర్తిని ,ఖ్యాతిని గడించిన జాతి మనది !
ఎన్ని భాషల్లో ప్రావీణ్యం సంపాదించినా .....
భాధ ,ప్రేమ ,సానుభూతి సొంత భాషలో కన్నా మధురం ఉంటుందా ??
భాషను ప్రేమిద్దాం !
భావాలను వ్యక్తీకరింద్దాం !
మన పిల్లలకి మన గుణాలు ,బుద్ధులు ,ఆస్తులు ,
రోగాలు ,ఆచారాలు అందించినట్టే  భాషను  కూడా అందిద్దాం !
అదీ మన భాధ్యతే నని గుర్తిద్దాం !!
 తెలుగుని కాపాడుకుందాం !!!!!

8 జనవరి, 2013

జీవితం

జీవితం గతాన్ని చూస్తూ ...భవిష్యత్ కి ప్రయాణం చేస్తూ ...వర్తమానాన్ని గడుపుతున్నట్టు వుంటుంది.
కాని ఒక్కటి నిజం....
గతాన్ని మార్చలేం ......అవి జ్ఞ్యాపకాలు .
భవిష్యత్ ని లిఖించలెమ్  ...అవి నుదిటి  రాతలు.
నువ్వు వేసే అడుగే వర్తమానం....చూసుకుంటూ ...సరిచేసుకుంటూ ..వెయ్ !!! అంతే !
గతం జ్ఞ్యపకం లా కాక అనుభూతిగా మిగులుతుంది.
భవిష్యత్ రాత గా కాక ....ఆశగా గోచరిస్తుంది.
 

manishi

మనిషి మంచి వైపు కంటే చెడు వైపు

                      ఆకర్షితుదవుతూ వుంటాడు.

ఆ చెడు గురించి పశ్చాతాపపడుతుంటాడు .

పైగా అదో వ్యక్తిత్వంమ్  లా గర్వంతో మురిసిపోతుంటాడు.

ఇతరులకి అర్ధం కాని గొప్పదనం తనలో ఉన్దని  ఆత్మవంచనకి గురవుతాడు.

26 ఆగస్టు, 2011

నీ వొస్తావ్ ..!!



"గుండె బాధతో నిండినపుడు ,

మాట పెగలక మౌనం నా భాష అయినపుడు ,

రెప్పలు నిశ్సబ్దంగా ...కన్నీరు

ఒలికించినపుడు,

నేననే నిస్తేజం ...నన్నొదిలి వెల్లిపోతానన్నపుడు,

అప్పుడే ...సరిగ్గా అప్పుడే ...,

నేనున్నానంటూ ...నీవు నా గుండె గది తడతావ్ !

వెన్నెలంత చల్లని నవ్వుతో ,

గతాన్నంతా తోడి , నా హృదయాన్ని జ్ఞ్యపకాల్తో తడిపేస్తావ్!

ఈ రోజెంత నిజమో ??నిన్నటి నీ జీవితం అంతకంటే నిజం అని

నిరూపిస్తావ్ !

నీదిగా నిండిన స్వేచ్ఛావాయువుల చల్లదనం ...

ఇంకా నీతోనే ఉందంటావ్ !

మరిపిస్తావ్ ! మురిపిస్తావ్ !!

నిజాలని నమ్మమంటావ్ !!

నిన్ను నీవు వదలొద్దు అంటావ్ !!

కానీ ...,

కానీ ...,

ఒక్కటి మాత్రం ఎప్పటికి చెప్పవ్ !

ఆ రోజులు మరలా తిరిగి వస్తాయని ....

మరిన్ని జ్ఞ్యపకాలై ,నాలో మిగులు తాయని !!!!!,,





16 మే, 2011

నిన్నటి కల...


"నిన్నటి కల నిజమై .... ముంగిట నిలిచింది !
నిశ్శబ్దాన్ని జయించి , చైతన్య శంఖారావం పూరించింది !
నిస్తేజం రెక్కలు విదిల్చి ,నూతన ఉత్సాహం పుంజుకుంటోంది !
నిదురించిన ఆశలు, చైతన్య విహంగాలయినవి.
నేననే పదం కొత్త అర్ధాలు వెతుక్కుంటోంది .
చీకటి చారలు వెనుక .......ఏదో కొత్త ఉత్సాహం నాకోసం
ఎదురుచూస్తోంది
.
నిన్నటి కల నిజమై , కలతలేని రాత్రులకు నాంది పలికింది.
ఆనందం అంచులను తాకుతోంది.,,